హిందుత్వవాదానికి మోదీ పునాది వేశారు | PM Modi Laid The Foundation For Hindutva,Says Asaduddin Owaisi | Sakshi
Sakshi News home page

హిందుత్వవాదానికి మోదీ పునాది వేశారు :ఒవైసీ

Aug 5 2020 4:19 PM | Updated on Mar 21 2024 4:35 PM

సాక్షి, హైదరాబాద్‌ : అయోధ్యలో రామ మందిరం భూమి పూజకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరకావడంపై హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ మండిపడ్డారు. ప్రధాని  మోదీ హిందుత్వవాదానికి పునాది వేశారని విమర్శించారు. బుధవారం ఆయన ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. దేశ ప్రధానికి ఏ ఒక్క మతంపై ప్రేమ ఉండకూడని వ్యాఖ్యానించారు . ఒక మందిరం కానీ,  ఒక మసీదు కానీ దేశానికి ప్రతీక కాబోవన్నారు. అయోధ్య వివాదంలో బీజేపీ, సంఘ్‌పరివార్‌ సుప్రీంకోర్టుకు అసత్యాలు చెప్పారని ఆరోపించారు. 

కాగా, అంతకు ముందు ట్వీటర్‌ వేదికగా కూడా బీజేపీ ప్రభుత్వంపై ఒవైసీ మండిపడ్డారు. ‘బాబ్రీ మసీదు ఉండేది, ఉంది, కచ్చితంగా ఉంటుంది’అనే అర్థం వచ్చేలా  బాబ్రీ జిందా హై అనే హ్యాష్‌ట్యాగ్స్‌‌తో ట్వీట్‌ చేశారు. కాగా, రామ మందిరం భూమి పూజ కార్యక్రమానికి హాజరు కావాలన్న ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయాన్ని సైతం గతంలో అసదుద్దీన్ ఒవైసి తీవ్రంగా తప్పుపట్టిన సంగతి తెలిసిందే.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement