గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులో శ్రీ భూసేమత దశావతార వెంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం శుక్రవారం వైభవంగా జరిగింది. గణపతి సచ్చిదానంద స్వామిజీ చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. ఏకశిలా విగ్రహంలో ఏకాదశ రూపాలు కలిగిన 11 అడుగుల ఎత్తున్న వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లతో పాటు ఇతర ప్రముఖులు హాజరయ్యారు.