నేటి నుంచి నూతన మద్యం పాలసీ | New liquor policy in AP | Sakshi
Sakshi News home page

నేటి నుంచి నూతన మద్యం పాలసీ

Oct 1 2019 8:03 AM | Updated on Oct 1 2019 8:13 AM

రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ నేటి నుంచి ఆరంభం కానుంది. కొత్త విధానంలో ప్రభుత్వం దశల వారీగా మద్యనిషేధానికి అధిక ప్రాధాన్యం ఇవ్వనుంది. ఇందులో భాగంగా మంగళవారం అక్టోబర్‌ 1 నుంచి పలు కీలక మార్పులను సర్కారు తీసుకొస్తోంది. ప్రధానంగా మద్యం అమ్మకాలు ఇకపై రాత్రి 8 గంటల వరకే పరిమితం చేస్తున్నారు. దీని ప్రభావం ఒకరోజు ముందుగానే కనపడింది. మద్యం షాపులు సోమవారం రాత్రి పదిగంటలకే మూతబడ్డాయి. అలాగే, బార్ల సమయం కూడా కుదిస్తున్నారు. దీనికి సంబంధించి మంగళవారం ఉత్తర్వులు వెలువడనున్నాయి. మరోవైపు.. మంగళవారం నుంచి ప్రైవేట్‌ మద్యం షాపులు కనుమరుగు కానున్నాయి.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement