స్వాతంత్య్రం వద్దన్న న్యూ కెలడోనియా | New Caledonia Rejects Independence | Sakshi
Sakshi News home page

Nov 5 2018 4:46 PM | Updated on Mar 21 2024 6:46 PM

పసిఫిక్‌ సముద్రంలోని న్యూ కెలడోనియా దీవుల వాసులు ఫ్రాన్స్‌ దేశంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం జరిగిన రెఫరెండంలో మొత్తం 2.69 లక్షల జనాభాలో అర్హులైన 1.75 లక్షల మంది పాల్గొన్నారు. మొత్తం ఓటింగ్‌లో 70 శాతం లెక్కింపు పూర్తి కాగా అందులో 59.5 శాతం మంది స్వాతంత్య్రం వద్దు, ఫ్రాన్స్‌తోనే ఉంటామంటూ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు స్థానిక అధికారులు తెలిపారు. అయితే, ఈ ఫలితాలు 1853లో ఫ్రాన్స్‌ వలస ప్రాంతంగా మారిన తర్వాత అక్కడ సెటిలైన శ్వేత జాతీయులు, స్థానిక కనాక్‌ ప్రజల మధ్య వైషమ్యాలను మరింత పెంచే ప్రమాదముందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement