ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న విధానాలు నచ్చక నాయకులు పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. టీడీపీ నేత కువ్వారపు బాలాజీతో పాటు వందలాది మంది కార్యకర్తలు బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సమక్షంలో వీరంతా వైఎస్సార్‌సీపీలోకి వచ్చారు. వీరిని మంత్రి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు చూసి వైఎస్సార్‌సీపీలో చేరినట్టు ఈ సందర్భంగా కువ్వారపు బాలాజీ తెలిపారు.
నెల్లూరు జిల్లా టీడీపీకి మరో షాక్
Oct 9 2019 5:18 PM | Updated on Mar 21 2024 11:35 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement