ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్( ఎబిఎస్‌యూ), నేషనల్ డెమోక్రాటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్(ఎన్‌డిఎఫ్‌బి), బిటిసి చీప్ హగ్రమా మొహిలరీ, అస్సాం ప్రభుత్వం బోడో ఒప్పందం సక్రమంగా జరగడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. వారందరికి తాను మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మోదీ తెలిపారు. చారిత్రాత్మకమైన బోడో ఒప్పందం ద్వారా ఇక నుంచి అస్సాం ప్రాంతం అభివృద్ధి బాటలో పయనించనుందని మోదీ వెల్లడించారు. అస్సాంలో బోడో డామినేట్ ప్రాంతంలో శాంతి నెలకొనాలనే ఉద్దేశంతో జనవరి 27న కేంద్ర ప్రభుత్వంతో నేషనల్ డెమొక్రాటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్, అల్ బోడో స్టూడెంట్స్ యూనియన్, ఇతర పౌర సమాజ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి.