కీచక అధ్యాపకుడిని నిలదీసిన మహిళలు..
లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో ఆంగ్ల విభాగాధిపతిగా పనిచేస్తున్న డాక్టర్ ఎన్. సూర్యరాఘవేంద్ర సస్పెండ్ అయ్యారు. రాఘవేంద్రపై లైంగిక ఆరోపణలు రావడంతో అంతర్గత విచారణ చేపట్టిన యూనివర్సిటీ వైఎస్ చాన్సలర్ అతన్ని సస్సెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే అంతకు ముందు రాఘవేంద్ర చేసిన తప్పును ఒప్పుకోవాలని పలువురు మహిళలు డిమాండ్ చేశారు. వారిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తల్లి విజయలక్ష్మి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర సాగించిన వేధింపులను వారు వీసీ దృష్టికి తీసుకువచ్చారు. అలాగే రాఘవేంద్రను పలు అంశాలపై నిలదీశారు. అధ్యాపకుడు అయి ఉండి విద్యార్థినిలతో అసభ్యకరంగా చాటింగ్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. రాఘవేంద్రనుపై చర్యలు తీసుకోవాలని.. ఆయన్ని కచ్చితంగా శిక్షించాలని కోరారు. విద్యార్థుల లేఖపై స్పందించి చర్యలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి