ఏపీ మంత్రి నారా లోకేశ్‌కు తెలుగులో ఎలా మాట్లాడాలో తగిన శిక్షణ ఇవ్వడంతో పాటు పాఠాలు నేర్పుతున్న పెద్ది రామారావుకు ప్రభుత్వం భారీ నజరానా ఇచ్చింది. లోకేశ్ ప్రసంగాలను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు మార్పులు సూచించే ఆయనను గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికా మండలి సభ్యుడిగా నియమించింది. ఆయనకు నెలకు రూ. లక్ష వేతనం, హెచ్‌ఆర్‌ఏ కింద రూ.35 వేలు, అలాగే ప్రభుత్వ సలహాదారుతో సమానంగా ఇతర అలవెన్సులన్నీ వర్తింపజేయాలంటూ బుధవారం ప్రణాళికా శాఖ కార్యదర్శి సంజయ్‌గుప్త ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఆయనకు ఒక ప్రైవేట్ కార్యదర్శిని, ఒక ప్రైవేట్ అసిస్టెంట్‌ను, ఇద్దరు ఆఫీస్ సబార్డినేట్స్‌ను కూడా ఇవ్వనున్నట్లు జీవోలో స్పష్టం చేశారు.