బొద్దింకల బెడద తొలగించుకోవాలని చూసిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. బొద్దింకల గూడును కాల్చేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టడంతో పచ్చని గార్డెన్ తునాతునకలైంది. ఈ ఘటన బ్రెజిల్‌లో చోటుచేసుకుంది. వివరాలు... సీజర్ సీమిజ్(48) అనే వ్యక్తి భార్యతో కలిసి విలాసవంతమైన బంగ్లాలో నివసిస్తున్నాడు.