రెండోరోజు టీవీ9 సంస్థలో కీలక పరిణామాలు | Mahendra Mishra as CEO of TV9 | Sakshi
Sakshi News home page

రెండోరోజు టీవీ9 సంస్థలో కీలక పరిణామాలు

May 10 2019 6:28 PM | Updated on Mar 22 2024 10:40 AM

రెండోరోజు టీవీ9 సంస్థలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రవిప్రకాశ్‌ ఫోర్జరీ కేసు వివాదంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న టీవీ9 బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల బృందం శుక్రవారం సాయంత్రం టీవీ9 ఆఫీస్‌లో సమావేశమైంది. సంస్థ ప్రక్షాళనకు నడుం బిగించింది. సీఈవో రవిప్రకాశ్‌, సీఎఫ్ఓ‌ మూర్తిని పదవుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త సీఈవోగా మహేంద్ర మిశ్రా, సీఓఓగా గొట్టిపాటి సింగారావును నియమించింది. టీవీ9 ఆఫీస్‌లో కొత్త సెక్యురిటీ సిబ్బందిని కూడా నియమించారు.

Advertisement
 
Advertisement
Advertisement