ఉమ్రా యాత్ర పేరుతో భారీ మోసం

పేద మైనారర్టీలను తక్కువ టికెట్‌ ఖర్చుతో ఉమ్రాకు పంపిస్తామని ఓ ట్రావెల్ ఏజెన్సీ బడా మోసానికి పాల్పడింది. దీంతో ట్రావెల్‌ ఏజెన్సీ ఎదుట ముస్లింలు ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. తక్కువ టికెట్‌ ధరతో కడప ఆల్మాస్‌ పేటలో కేఎస్‌ఎస్‌ ఉమ్రా ట్రావెల్‌ ఏజెన్సీ ఒక్కొక్కరి దగ్గర రూ. 30 వేల వరకూ వసూలు చేసింది. డబ్బులు చెల్లినా వారి నుంచి ఎలాంటి సమాచారం లేదనే అనుమానంతో బాధితులు ఆరాదీశారు. వసూలు చేసిన సొమ్ముతో వారు ఉండాయించారనే సమాచారంతో బాధితులు ట్రావెల్‌ ఏజెన్సీ ఎదుట సోమవారం ఆదోళన చేపట్టారు. 

జిల్లాలోని ప్రొద్దుటూరు, కదిరి, మదనపల్లి తదితర ప్రాంతాల వారు ఇందులో మోసపొయ్యారు. బాధితులు ప్రొద్దుటూరు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రొద్దుటూరు పోలీసులు ఏజెన్సీ నిర్వాహకుడు ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అలీతో పాటు మరో ముగ్గురిని బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఈ ట్రావెల్‌ ఏజెన్సీ రూ. 200 కోట్ల వరకూ వసూలు చేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top