భారీ వర్షాలకు కేరళ చివురుటాకులా వణికిపోతున్న సంగతి తెలిసిందే. వరద బాధితులను రక్షించడానికి సహాయక బృందాలు శక్తికి మించి కృషి చేస్తున్నాయి. సహాయక చర్యలో పాల్గొంటున్న ఎన్డీఆర్‌ఎఫ్, నేవీ, ఆర్మీ బలగాలకు పలువురు మత్య్సకారులు తమ వంతు సహకారాన్ని అందజేస్తున్నారు. వెంగర ప్రాంతంలో దాదాపు 600 మంది స్థానిక మత్స్యకారులు వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించి సహాయక శిబిరాలు చేర్చేందుకు తమ వంతు కృషిచేస్తున్నారు.అలా సహాయక చర్యల్లో పాలు పంచుకున్న కేపీ జైస్వాల్ అనే మృత్యకారుడు రియల్ హీరోగా నిలిచాడు. వరదల్లో చిక్కుకున్న మహిళలను, చిన్నారులను బోట్‌లోకి ఎక్కించడానికి అతను నీటిలో వంగి తన వెన్నును మెట్టుగా మార్చాడు. అలా మహిళలు, చిన్నారులు బోటు ఎక్కడానికి సహాయపడ్డాడు. ఆ ప్రాంతంలోకి సహాయక బృందాలు చేరుకోవడం కష్టంగా ఉండటంతో ఎన్డీఆర్‌ఎఫ్ బోట్ల ద్వారా వరదల్లో చిక్కుకున్న వారిని సహాయక శిబిరాలకు చేరవేస్తున్నట్టు జైస్వాల్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మరింది.
కేరళ వరదలు ; వెన్నును మెట్టుగా మార్చాడు
Aug 19 2018 4:48 PM | Updated on Mar 21 2024 7:54 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement