దేశం విడిచివెళ్లలేదు.. వదంతులు నమ్మవద్దు | Kalki Ashrams Founders Release Video | Sakshi
Sakshi News home page

దేశం విడిచివెళ్లలేదు.. వదంతులు నమ్మవద్దు

Oct 22 2019 10:12 AM | Updated on Mar 21 2024 8:31 PM

కల్కి ఆశ్రమ వ్యవస్థాపకులైన విజయ్ కుమార్ నాయుడు, పద్మావతి నాయుడు ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు. ఐటీ దాడుల నేపథ్యంలో తమిళనాడులోని నేమమ్ ఆశ్రమంలోనే వారు అందుబాటులో ఉన్నారంటూ కల్కీ ఆశ్రమం మీడియాకు ఓ వీడియోను విడుదల చేసింది. తమ ఆరోగ్యం బావుందని, తమ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ వీడియోలో విజయ్‌కుమార్‌ దంపతులు పేర్కొన్నారు. తాము దేశం విడిచి వెళ్లిపోయానని మీడియాలో కథనాలు వస్తున్నాయని, కానీ, తాము దేశం విడిచివెళ్లలేదని, వదంతులు నమ్మవద్దని వారు కోరారు. కల్కి ఆశ్రమ ప్రధాన కార్యాలయాల్లో యథావిధిగా కార్యక్రమాలు జరుగుతున్నాయని వారు తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement