నిన్న కూడా ఎన్నికల ప్రచారంలో వైఎస్‌ వివేకా

వైఎస్‌ వివేకానందరెడ్డి మరణం చాలా బాధాకరని కడప మేయర్‌ సురేశ్‌ అన్నారు. నిన్న కూడా చాపాడు మండలంలో తమతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని తెలిపారు. ఈరోజు ఇలాంటి దుర్వార్త వినాల్సి రావడం దురదృష్టకరమన్నారు. 20 ఏళ్లుగా కడప రాజకీయాల్లో తమకు చేదోడు వాడుగా నిలిచిన వివేకానందరెడ్డి హఠాన్మరణం చెందడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. ఆయన చాలా నిరాడంబరంగా ఉండేవారని, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి అని చెప్పారు.

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top