దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణకు ఆదేశిస్తూ రిటైర్డు జడ్జి జస్టిస్ వికాస్ శ్రీధర్ సిర్పుర్కర్ నేతృత్వంలో సుప్రీంకోర్టు దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. ఘటనపై ఆరు నెలల్లో విచారణ జరిపి దర్యాప్తు నివేదిక అందజేయాలని కమిషన్‌ను ఆదేశించింది. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన దిశ నిందితుల ఎన్‌కౌంటర్ ఘటనపై సర్వోన్నత న్యాయస్థానం రెండో రోజు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. నిందితులు తుపాకులు లాక్కొని కాల్పులు జరిపారని.. ఆత్మరక్షణ కోసమే పోలీసులు ఎదురు కాల్పులు జరిపారని రోహత్గీ కోర్టుకు విన్నవించారు. ఈ క్రమంలో... నిందితులు కాల్పులు జరిపితే బుల్లెట్లు ఏవి అని సుప్రీంకోర్టు ఆయనను ప్రశ్నించింది. నిందితుల కాల్పుల్లో పోలీసులు ఎవరూ గాయపడలేదా అని ప్రశ్నలు సంధించింది. ఇందుకు బదలుగా నిందితులు కాల్చిన బుల్లెట్లు దొరకలేదని రోహత్గీ న్యాయస్థానానికి సమాధానమిచ్చారు.
వెటర్నరీ డాక్టర్‌కు మానవ హక్కులు ఉండవా
Dec 12 2019 12:46 PM | Updated on Mar 20 2024 5:39 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement