మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్‌రావు నివాసాల్లో రెండో రోజూ ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. ఏకకాలంలో విజయవాడ, హైదరాబాద్‌లో ఆయన నివాసాల్లో దాదాపు 36 గంటలపాటు సోదాలు జరుగుతున్నాయి. ఇక మాజీ మంత్రి నారా లోకేష్ ప్రధాన అనుచరుడు కిలారి రాజేష్ ఇళ్లల్లో, కంపెనీ కార్యాలయాల్లో కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.