బిహార్ మాజీ సీఎం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి మరో షాక్ తగిలింది. ఐఆర్‌సీటీసీ మని లాండరింగ్ కేసులో లాలూ ప్రసాద్, ఆయన సతీమణి రబ్రీదేవి, కుమారుడు తేజస్వీ యాదవ్‌లకు ఢిల్లీ కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది. ఈ కేసులో నిందితులను అక్టోబర్ ఆరులోపు తన ముందు హాజరుకావల్సిందిగా కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం లాలూ రాంచీ జైల్లో శిక్ష అనుభవిస్తున్నందున ఆయనకు ప్రొడక్షన్ వారెంట్‌ను జారీ చేసింది.