నీ హక్కుకు రక్షణగా నేనున్నా!
పుట్టిన ప్రతి మనిషికి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. ప్రతి పౌరుడికి కనీస అవసరాలను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. హక్కులను హరించే హక్కు ఎవరికి ఉండదు. అయితే కొన్ని సందర్భాలలో ఆ ప్రభుత్వాలే హక్కులను కాలరాస్తుంటాయి. అటువంటి సందర్భాలలో కోర్టుకెక్కి మన హక్కులను దక్కించుకుంటున్నాం. అయితే రారాను మన హక్కులను మనకు దక్కకుండా చేస్తున్నారు. అందుకే ఐక్యరాజ్యసమితి ప్రపంచంలో పౌరులందరికి తమ హక్కులు దక్కేలా కృషి చేస్తూ ప్రతి యేడాది డిసెంబర్ 10వ తేదీన మానవహక్కుల దినోత్సవంగా నిర్వహిస్తుంది. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి మానవహక్కుల పరిరక్షణకు చేస్తున్న కృషి, చేపడుతున్న చర్యలు తెలుసుకోవాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి