భారత వైమానిక దాడులకు ప్రతిదాడిగా పాకిస్తాన్ ప్రయత్నించిందని భారత విదేశాంగశాఖ పేర్కొంది. ' 3 పాక్ జెట్ విమానాలు భారత గగనతలంలోకి వచ్చాయి. సైనిక స్థావరాలే లక్ష్యంగా పాక్ దాడులకు యత్నించింది. అప్రమత్తమైన భారతవైమానిక దళం వారి దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్ 16 యుద్ధ విమానాన్ని కూల్చేశాం. ఈ ఘటనలో భారత్‌కు చెందిన మిగ్-21 విమానం కూలిపోయింది. ఒక పైలట్ జాడ తెలియడం లేదు' అని భారత విదేశాంగశాఖ ప్రతినిధి తెలిపారు.