ఆధ్యాత్మికవేత్తగా ప్రజలను మోసం చేస్తున్న కుమార్ గిరిష్ సింగ్ అనే బురిడి బాబాను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. డీమ్ బ్రిడ్జ్ మనీ సర్క్యూలేషన్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న గిరీష్ సింగ్‌తోపాటు అతని సోదరుడు దిలిప్ సింగ్‌ను ఎస్‌ఆర్ నగర్‌లో అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి నాలుగు కార్లను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీకి చెందిన గిరీష్ సింగ్ ఆధ్యాత్మిక వేత్తగా ప్రజలను మోసం చేస్తూ దాదాపు రూ.40 కోట్లు కాజేశారు.