‘నీ ఒంట్లో దెయ్యం ఉంది.. నేను చెప్పినట్లు చెయ్‌! | Husband Beats Wife In Front Of Villagers In Rajasthan | Sakshi
Sakshi News home page

Mar 8 2019 6:30 PM | Updated on Mar 22 2024 11:31 AM

మాంత్రికుడు చెప్పినట్లు చెయ్యలేదన్న కోపంతో ఊరి ప్రజలందరూ చూస్తుండగా భార్యను విచక్షణా రహితంగా చితకబాదాడో భర్త. ఈ సంఘటన రాజస్తాన్‌లోని బార్మర్‌ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బార్మర్‌ జిల్లాలోని మందాపుర గ్రామానికి చెందిన ఓ మహిళ కొన్నిరోజులుగా కడుపునొప్పి వస్తోందని మంగళవారం భర్తకు చెప్పింది. దీంతో అతడు ఆమెను ఆసుపత్రికి తీసుకుపోకుండా మాంత్రికుడి వద్దకు తీసుకెళ్లాడు. ఆమెకు దెయ్యం పట్టిందని, దీని కోసం కొన్ని పూజలు చేస్తే సరిపోతుందని మాంత్రికుడు చెప్పాడు.

Advertisement
 
Advertisement
Advertisement