కర్నూలు జిల్లా పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గౌరు చరితా రెడ్డి నోట జై జగన్ అనే మాట రావడంతో తెలుగు తమ్ముళ్లు అవాక్కయ్యారు. ప్రచారంలో భాగంగా ఓ గ్రామానికి వెళ్లిన ఆమె.. తనకు ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక తన ప్రసంగాన్ని ముగిస్తూ జై జగన్ అంటూ నాలుక్కరుచుకున్నారు. దీంతో అక్కడున్నవారంతా షాక్‌కు గురయ్యారు.