ఈశాన్య ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లపై మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న హింసాత్మక ఘటనలకు బీజేపీ నేత కపిల్ మిశ్రా కారణమని ఆరోపణలు వినిపిస్తున్న తరుణంలో.. హింసను ప్రేరేపించేలా ప్రవర్తించిన వారు ఎంతటి వారైనా చర్యలు తప్పవని గంభీర్ స్పష్టం చేశారు.