కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ కళాశాలలో మరో విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. ఫస్ట్ ఇయర్ చదువుతున్న రమాదేవి కాలేజీ భవనంపై నుంచి దూకింది. తీవ్రంగా గాయపడిన ఆమెను హుటాహుటిన స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటికే విద్యార్ధిని చేయి విరగడంతో పాటు తీవ్ర రక్తస్రావం కావడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు.