సవిత ఇంజనీరింగ్‌ కళాశాలలో అగ్ని ప్రమాదం

నగర శివార్లలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తండలంలోని సవిత ఇంజనీరింగ్‌ కళాశాల ఆవరణలోని బాయ్స్‌ హాస్టల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. హాస్టల్‌ బిల్డింగ్‌ మొత్తం ఎనిమిది అంతస్తులు ఉండగా.. నాలుగో అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో హాస్టల్‌ గదులు పూర్తిగా దగ్దమయ్యాయి. ఉదయం 5 గంటలకు జరిగిన ఈ ప్రమాదం నుంచి విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు.  ఈ హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థుల్లో తెలుగువారే అధికం. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top