చరిత్ర సృష్టించిన స్పేస్‌ ఎక్స్‌ | Falcon Heavy Lifts Tesla Car Successfully to Space | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన స్పేస్‌ ఎక్స్‌

Feb 7 2018 5:51 PM | Updated on Mar 22 2024 11:29 AM

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్‌ ప్రయోగం మంగళవారం విజయవంతమైంది. 18, 747 జెట్‌ లైనర్ల వేగంతో ఫాల్కన్‌ హెవీ రాకెట్‌ అంతరిక్షంలోకి దూసుకెళ్లిన రాకెట్‌.. కారును అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. అంగారకుడి కక్ష్యలోకి టెస్లా రోడ్‌స్టర్‌ కారు చేరనుంది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో అంతరిక్ష రంగంలో స్పేస్‌ ఎక్స్‌ కొత్త చరిత్ర సృష్టించింది.

ఫాల్కన్‌ హెవీ రాకెట్‌కు అమర్చిన 27 ఇంజిన్లను క్రమపద్దతిలో మండించిన శాస్త్రజ్ఞులు ప్రయోగాన్ని విజయవంతం చేశారు. ఈ క్రమంలో ఇంజిన్ల నుంచి వెలువడి పొగ పెద్ద పర్వతంలా కనిపించింది. ఫాల్కన్‌ రాకెట్‌ చేసిన శబ్దానికి ఫ్లారిడా స్పేస్‌ కోస్ట్‌ కంపించిపోయింది. మొత్తం ఆరు గంటల పాటు కొనసాగిన ప్రయోగాన్ని శాస్త్రజ్ఞులు లైవ్‌లో తిలకించారు.

చంద్రుడిపైకి అపోలో 11 అంతరిక్ష వ్యోమ నౌకను ప్రయోగించిన లాంచ్‌పాడ్‌ నుంచి ఈ ప్రయోగం చేయడం గమనార్హం. ప్రయోగ సమయంలో పెద్ద ఎత్తున పొగలు ఎగిసిపడ్డాయి.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement