చంద్రబాబు పెద్ద ఎత్తున అవినీతి చేస్తున్నారని సీఎం వైఎస్ జగన్ గతంలోనే చెప్పారని.. ఆ అవినీతి బండారం ఇవాళ బయట పడిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. పీఎస్ శ్రీనివాస్ వద్ద పట్టుబడిన సొమ్ము చంద్రబాబుదేనని.. అందువల్ల ఆయనను తక్షణమే అరెస్టు చేసి తీహారు జైలుకు పంపించి, అవినీతి ఆరోపణలపై కేంద్రం విచారణ చేయాలని డిమాండ్ చేశారు.