బిర్యానీ లేదన్నందుకు రెచ్చిపోయారు..!

డీఎంకే కార్యకర్తలు బరితెగించారు. కేవలం బిర్యానీ లేదని చెప్పినందుకు ఓ హోటల్‌ నిర్వాహకులను చితకబాదారు. డీఎంకే అధినేత, కురువృద్ధుడు ఎం కరుణానిధి ఆరోగ్యం విషమించి.. ఆస్పత్రిలో చేరిన రోజే.. డీఎంకే కార్యకర్తలు ఇలా రౌడీయిజానికి దిగారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. చెన్నై విరుగంబాకంలోని ఎస్‌ఎస్‌ హైదరాబాద్‌ బిర్యానీ హోటల్‌లో ఐదురోజుల కిందట ఈ ఘటన చోటుచేసుకుంది. డీఎంకే కార్యకర్తలు హోటల్‌కు వచ్చి తమకు బిర్యానీ కావాలని ఆర్డర్‌ చేశారు. అయితే, బిర్యానీ లేకపోవడంతో అదే విషయాన్ని వారికి హోటల్‌ సిబ్బంది చెప్పారు. దీంతో డీఎంకే కార్యకర్తలు చెలరేగిపోయి.. హోటల్‌ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగి.. వారిని చితకబాడారు. కరుణానిధి తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన రోజే ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top