సాక్షి, హైదరాబాద్: దిశ అత్యాచార నిందితులను ఎన్‌కౌంటర్ చేయడం తాను స్వాతిస్తున్నట్లు చేసిన వ్యాఖ్యలపై సీపీఐ నారాయణ సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ వెనక్కితగ్గారు. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో నారాయణ వ్యాఖ్యలు పలువురు ఖండించడంతో. ఎన్‌కౌంటర్‌ను సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ‘ఎన్‌కౌంటర్లు మా పార్టీ సిద్ధాంతాలకు ఇది వ్యతిరేకం. వారి ఎన్‌కౌంటర్ పై నేను చేసిన వ్యాఖ్యలు నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఎన్‌కౌంటర్‌ని పార్టీ వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది. తన వ్యాఖ్యలపై ప్రజా సంఘాలకు పార్టీ కి క్షమాపణ చెపుతున్నాను. అని నారాయణ ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు క్షమాపణాలు చెబుతున్నట్లు పేర్కొన్నారు.
ఎన్‌కౌంటర్‌పై క్షమాపణలు చెప్పిన నారాయణ
Dec 8 2019 1:10 PM | Updated on Dec 8 2019 1:13 PM
Advertisement
Advertisement
Advertisement
