రుచికరమైన భోజనం వడ్డించలేదనే కారణంతో పెళ్లికొచ్చిన అతిథులు హోటల్ సిబ్బందిని చితక్కొట్టారు. ఈ ఘటన పశ్చిమ ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాలు.. జనక్‌పురిలోని పికాడిలీ హోటల్‌లో ఓ వివాహ వేడుక జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాట్లు సరిగాలేవనే కారణంతో పెళ్లి అతిథులు హోటల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.