దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధం | Dasara Arrangements Are Completed In Vijayawada Durga Temple | Sakshi
Sakshi News home page

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధం

Sep 28 2019 7:41 PM | Updated on Sep 28 2019 7:52 PM

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దసరా మహోత్సవాలకు సర్వం సిద్ధమైంది. 10 రోజుల పాటు జరిగే వేడుకలకు రాష్ట్ర నలుమూల నుంచి గాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు ఇంద్రకీలాద్రికి విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా దేవస్థానం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తొలి రోజున ఉదయం 9 గంటలకు దర్శనంఉత్సవాలలో భాగంగా తొలి రోజైన 29వ తేదీ ఆదివారం తెల్లవారుజామున అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకరణ, పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 9 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఉత్సవాలలో తొలి రోజు ఆదివారం కావడంతో అమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా దర్శనమివ్వనున్నారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement