ఓ పాఠశాలలో స్థానిక నేత డ్యాన్స్ ప్రోగ్రామ్ నిర్వహించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. విద్యార్థులను స్కూలు టెర్రస్ మీద మండుటెండలో కూర్చోబెట్టిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలగుచూసింది. ప్రోగ్రామ్‌కు పర్మిషన్ ఇచ్చిన స్కూలు యాజమాన్యంతో పాటు ఇలా పాఠశాలలో ఇలాంటి ఈవెంట్ నిర్వహించిన నేతపై బాలల హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి.