వేదిక మీద తోపులాట.. చేయి చేసుకున్న నేతలు

ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలను నిరసిస్తూ.. ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వ తీరును ఖండిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమం రసాభాసగా మారింది. వేదిక మీద కుర్చీలో కూర్చునే విషయంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత హనుమంతరావు, ఆ పార్టీ అధికార ప్రతినిధి నగేశ్‌ మధ్య గొడవ జరిగింది. ఒకరినొకరు తోసుకొని.. కుర్చీలో కూర్చునేందుకు ఇద్దరు నేతలు ప్రయత్నించారు. ఈ క్రమంలో వీహెచ్‌, నగేశ్‌ వేదిక మీదే పరస్పరం బాహాబాహీకి దిగారు. పరస్పరం తోసుకుంటూ కింద పడ్డారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top