తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఓ నయా నవాబ్ అని ఏఐసీసీ అధికార ప్రతినిధి, సినీనటి ఖుష్బూ ధ్వజమెత్తారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నన్ని రోజులు కనీసం ఒక్క రోజు కూడా సచివాలయానికి రాని కేసీఆర్.. మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల మధ్యనే ఉంటాననడం హస్యాస్పదంగా ఉందన్నారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే కేసీఆర్ మహిళలకు సీట్లు మాత్రం కేటాయించలేదని విమర్శించారు.