తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. మేడిగడ్డ పంప్‌హౌస్‌లోని 6వ నంబర్ మోటార్‌ను ఆన్ చేయడం ద్వారా గోదావరి ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టారు. సాగునీటి రంగ చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో అనతి కాలంలోనే పూర్తయిన బృహత్తర బహుళార్ధక సాధక కాళేశ్వర ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేశారు.