తాడిపత్రి సీఐ నారాయణరెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. జేసీ వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని సీఐ నారాయణరెడ్డిపై ఆరోపణలు రావడంతో ఈసీ పోలింగ్‌కు ముందే ఎన్నికల విధుల నుంచి తప్పించిన విషయం తెలిసిందే. అయినా జేసీ ప్రభాకర్‌రెడ్డి కనుసన్నల్లో పనిచేస్తూ పోలింగ్ రోజు వైఎస్సార్‌సీపీ ఏజెంట్లకు వార్నింగ్ ఇచ్చారు. తాడిపత్రి మండలం ఎర్రగుంటపల్లిలో పోలింగ్ ఏజెంట్ కిషోర్‌ను పీఎస్‌కు రావాలంటూ హెచ్చరించారు. దీనికి సంబంధించిన ఆడియో టేపులు బయటపడ్డాయి. పోలింగ్ తర్వాత ముగ్గురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సీఐ నారాయణరెడ్డి.. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అండదండలతో రెచ్చిపోతున్నారు. ఆయనపై చర్యలు తీసుకునేందుకు పోలీసు ఉన్నతాధికారులు కూడా వెనకాడుతున్నారు.
బయటపడ్డ సీఐ నారాయణరెడ్డి వార్నింగ్ టేపులు
Apr 18 2019 12:01 PM | Updated on Mar 20 2024 5:08 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement