5 వేల మంది ఒకవైపు.. ఒక్కడు ఒకవైపు
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై దేశవ్యాప్తంగా నిరనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలతోపాటు, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలో కూడా నిరసనలు ఊపందుకున్నాయి. రెండు రోజుల క్రితం ఢిల్లీలోని జామియా యూనివర్సిటీలో విద్యార్థుల నిరసనలు ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. ఇక ఉత్తరప్రదేశ్‌లోని ప్రసిద్ధ అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో కూడా సీఏఏపై శుక్రవారం విద్యార్థులు ఆందోళనకు దిగారు. అయితే, జిల్లా ఎస్పీ ఆకాశ్ కుల్హరీ చాకచక్యంతో దాదాపు 5 వేల మంది పాల్గొన్న ఈ నిరసన కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి