ప్యాకేజీలు పవన్‌ వల్లే ప్రాచుర్యంలోకి వచ్చాయి | C Ramachandraiah Fires On Pawan kalyan And Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

ప్యాకేజీలు పవన్‌ వల్లే ప్రాచుర్యంలోకి వచ్చాయి

Apr 2 2019 3:23 PM | Updated on Mar 20 2024 5:03 PM

పవన్‌ కళ్యాణ్‌ అధికారపార్టీని వదిలి.. ప్రతిపక్షాన్ని విమర్శించడం దారుణమని.. ప్యాకేజీకి అమ్ముడుపోవడమే పౌరుషమా అని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య నిలదీశారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. పవన్‌ను నమ్మి పార్టీలో చేరినవారు ప్రస్తుతం తలలు పట్టుకుంటున్నారని అన్నారు. ఆరు నెలల కిందట చంద్రబాబు,లోకేష్‌ల అవినీతిపై మాట్లాడిన పవన్‌.. ప్రస్తుతం ప్రతిపక్షంపై విమర్శలు చేయటం దారుణమన్నారు. ప్యాకేజీలు పవన్‌ వల్లే ప్రాచుర్యంలోకి వచ్చాయని, చంద్రబాబుతో లాలూచీ పడటమే పౌరుషమా అని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement