చేతిలో తుపాకి ఉంది.. ఐతే ఏంటి?

తుపాకితో బెదిరించి దోచుకోవాలనుకున్న ఓ దొంగకు మతి పోయేలా చేసిందో మహిళ. తుపాకికి ఏ మాత్రం అదరకుండా.. బెదరకుండా అతడ్ని తరిమికొట్టింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లక్నోకు చెందిన ఓ మహిళ తన ఇంటిముందు నిలబడి ఉంది. ఇంతలో ఇద్దరు ముసుగు దొంగలు బైక్‌పై అక్కడకు చేరుకున్నారు. ఒక దొంగ బైక్‌పైనుంచి కిందకు దిగి ఆ మహిళను సమీపించాడు. మరో దొంగ అతడికోసం దూరంగా బైక్‌పై వేచిచూస్తున్నాడు. మహిళను సమీపించిన దొంగ తుపాకి బయటకు తీసి ఆమెను భయపెట్టాడు. ఒంటిమీది నగలు తీసివ్వకపోతే చంపుతానని బెదిరించాడు. ఇలాంటి సమయంలో మామూలు మనుషులైతే బిక్కచచ్చిపోయేవాళ్లే. కానీ ఆ మహిళ ఏ మాత్రం భయపడకుండా అతడిపై దాడికి దిగింది. ఈ ఊహించని పరిణామంతో అతడు బిత్తరపోయాడు. చేసేదేమీ లేక కాళ్లకు బుద్ధిచెప్పాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Back to Top