కర్ణాటక అసెంబ్లీ ప్రొటెం(తాత్కాలిక) స్పీకర్‌గా భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఎమ్మెల్యే కేజీ బోపయ్య కొనసాగేందుకు సుప్రీం కోర్టు శనివారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కర్ణాటకలో ప్రొటెం స్పీకర్‌గా సభ్యుల్లో సీనియర్‌ను కాకుండా బోపయ్యతో ప్రమాణం చేయించడంపై కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై శనివారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే సీనియర్‌ను కాకుండా వేరే వ్యక్తిని సైతం ప్రొటెం స్పీకర్‌గా నియమించిన ఘటనలు ఉన్నాయని పేర్కొన్నారు.