పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి జై శ్రీరాం నినాదాలతో కూడిన పది లక్షల పోస్టు కార్డులను పంపాలని నిర్ణయించామని బెంగాల్‌లోని బరక్‌పోర్ నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ తెలిపారు. జై శ్రీరాం అని రాసిఉన్న లక్షలాది పోస్టు కార్డులను ముఖ్యమంత్రి నివాసానికి పంపుతామని చెప్పారు. తృణమూల్ ఎమ్మెల్యే అయిన సింగ్ 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి ఆ పార్టీ నుంచి ఎంపీగా గెలుపొందారు.