బాలాకోట్ ఉగ్రశిబిరాలపై భారతవైమానిక దళాల దాడితో ధ్వంసమైన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఉగ్ర స్థావరాలు తిరిగి ప్రారంభమయ్యాయని భారత సైనికాధిపతి బిపిన్‌రావత్ చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో వెల్లడించారు. పుల్వామా దాడికి సమాధానంగా భారత వైమానికదళం దాడుల్లో «ధ్వంసమైన బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలను పాకిస్తాన్ ఇటీవలే తిరిగి ప్రారంభించిందని ఆయన తెలిపారు. పుల్వామాలో భారత సైనిక వాహనంపై ఉగ్రవాదుల దాడి 40 మంది భారత సైనికులను పొట్టనపెట్టుకున్న సంగతిని ఆయన గుర్తుచేశారు.
ప్రారంభమైన బాలాకోట్ జైషే ఉగ్రస్ధానం
Sep 24 2019 8:30 AM | Updated on Sep 24 2019 8:41 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement