వైఎస్ జగన్‌పై హత్యాయత్నం ఘటనలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ప్రమేయం లేదనుకుంటే సీబీఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు అంగీకరిస్తారని మాజీ ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై అనేక అనుమానాలు ఉన్నాయని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డీజీపీ వ్యాఖ్యలు కేసును పక్కదారి పట్టించేలా ఉన్నాయని మండిపడ్డారు. కేసును నీరుగార్చేందుకు బాబు యత్నిస్తున్నారని విమర్శించారు.