ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన ‘ఏపీ దిశ చట్టం’ మహిళలందరికీ ఆయుధం లాంటిదని ఏపీ బాలల హక్కుల పరిరక్షణ సమితి చైర్ పర్సన్ హైమవతి అన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దిశ చట్టం తీసుకొచ్చి రాష్ట్రంలోని మహిళలందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రక్షణ కల్పించారని ప్రశంసించారు. మహిళలపై నేరాలు చేయాలనుకునే వారికి భయం కలిగేలా చట్టం రూపొందించారని కొనియాడారు. దిశ చట్టాన్ని దేశం మొత్తం తీసుకురావాలని కోరారు.