ఏపీ గవర్నర్ ఏరియల్ సర్వే
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను శనివారం గవర్నర్ బిస్వభూషన్ హరిచందన్ ఏరియల్ సర్వే ద్వారా పర్యవేక్షించారు. కృష్ణా నదిలో వరద ప్రవాహం, నీట మునిగిన లంక గ్రామాలను పరిశీలించారు. వరద నివారణ చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. వరద పోటెత్తడంతో అధికారులు ఇప్పటికే హై అలర్డ్ ప్రకటించారు. వరద నేపథ్యంలో రెండు జిల్లాల్లోనూ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి