అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మత్స్యకారుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలు వారి ఆర్థిక సుస్థిరతను బలోపేతం చేయనున్నాయి. ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సముద్రంలో వేట నిషేధం. ఈ సమయంలో మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు గత ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.4 వేలు చెల్లించేది. దీనిని ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం ఏకంగా రూ.10 వేలకు పెంచింది. దీంతో రాష్ట్రంలోని 1.35 లక్షల మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. మౌలిక సదుపాయాలను ప్రాధాన్యతా క్రమంలో కల్పించడానికి బడ్జెట్‌లో మత్స్య శాఖకు రూ.551 కోట్లు కేటాయించింది.
మత్స్యకారులకు మంచిరోజులు
Nov 21 2019 8:02 AM | Updated on Nov 21 2019 8:08 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement