ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా

ఆంధ్రప్రదేశ్‌ ఉభయసభలు మంగళవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. నూతనంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఎన్నికైన తర్వాత తొలిసారి జరిగిన అసెంబ్లీ సమావేశాలు ఐదురోజులపాటు కొనసాగాయి. ఈ సమావేశాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, సభ్యులు ఎమ్మెల్యేలుగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. అనంతరం, స్పీకర్‌గా తమ్మినేని సీతారాం, డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి ఎన్నికయ్యారు. ఆ తర్వాత గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ వాడీవేడిగా జరిగింది. మొత్తం 19 గంటల 25 నిమిషాలపాటు అసెంబ్లీ సమావేశాలు నడిచాయి. ఈ సమావేశాల్లో 175మంది సభ్యులు ప్రసంగించారు. అనంతరం ప్రత్యేక హోదాపై శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top