అదే రభస.. అదే తీరు.. మళ్లీ అదే నిర్ణయం! ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా కేంద్ర సర్కారుపై వైఎస్సార్‌సీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం మరోసారి వాయిదా పడింది. మంగళవారం కూడా లోక్‌సభలో నిరసనలు చోటుచేసుకోవడంతో.. సభ ఆర్డర్‌లో లేదన్న కారణంగా స్పీకర్ సుమిత్రా మహాజన్ ‘అవిశ్వాసం’చర్చను చేపట్టలేకపోయారు