కృష్ణ కిషోర్ సస్పెన్షన్‌పై చంద్రబాబు గగ్గోలు పెట్టడం విడ్డూరం
పరిశ్రమల శాఖ నివేదికతోనే ఐఆర్‌ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌పై వేటు వేయడం జరిగిందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పష్టం చేశారు. అవినీతి ఆరోపణలతోనే ఆయనను ప్రభుత్వం సస్పెండ్ చేసిందని పేర్కొన్నారు. అయితే దీనిని రాష్ట్ర, జాతీయ సమస్యగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎల్లోమీడియా తప్పుగా చిత్రీకరిస్తోందని మండిపడ్డారు. తప్పు చేసిన అధికారిని సస్పెండ్ చేయకుండా సన్మానం చేస్తారా అంటూ ధ్వజమెత్తారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి