కథువా కన్నా దారుణం.. | 11-yr-old girl's mutilated body discovered, sexual assault suspected | Sakshi
Sakshi News home page

కథువా కన్నా దారుణం..

Apr 15 2018 3:50 PM | Updated on Mar 21 2024 7:48 PM

కథువా, ఉన్నావ్‌ గ్యాంగ్‌రేప్‌ ఘటనలపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్న తరుణంలో గుజరాత్‌లో మరో దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సూరత్‌లో ఓ మైనర్‌ బాలిక(11)ను వారం రోజులు లైంగిక దాడి చేసి, చిత్రహింసలు పెట్టిన మృగాళ్లు, చివరికి గొంతునులిమి హత్యచేశారు. ఏప్రిల్‌ 6న సూరత్‌లోని భెస్తన్‌లోని క్రికెట్‌ మైదానంలో బాలిక మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు పోస్ట్‌మార్టంకు పంపారు. బాలిక మృతదేహంపై 86 గాయాలు ఉన్నాయని పోస్ట్‌మార్టం అనంతరం సూరత్‌ సివిల్‌ ఆస్పత్రి ఫోరెన్సిక్‌ విభాగం చీఫ్‌ గణేశ్‌ గొవేకర్‌ తెలిపారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement